Ticker

6/recent/ticker-posts

tamalapaku : తమలపాకు వల్ల ప్రయోజనాలు

image show tamalapaku

tamalapakuతమలపాకు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయో జనాలు ఉన్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారికి సైతం ఎంతో మేలు చేస్తుంది. భారతీయ సంస్కృతిలో తమలపాకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన వెంటనే తమలపాకు తినేవారు ఇప్పటికి చాలామంది ఉన్నారు. తమలపాకు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు తమలపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

tamalapaku కు వల్ల ప్రయోజనాలు

చిన్నపిల్లలకు తరచుగా చీటికిమాటికి జలుబు చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంట ప్పుడు తమలపాకు నువ్వు కొద్దిగా వేడి చేసి దానిపైన ఆముదం రాసి, పిల్లల ఛాతి మీద పెడితే ఉపశమనం ఉంటుంది. తమలపాకు కాండాన్ని మరియు అతిమధురం చెక్కను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకుంటే జలుబు అనే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

పాటలు పాడేవారుఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని కొంచెం తీసుకొని బుగ్గన చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం ఉంటుంది. కంఠం పెగలకపోయి మాట పెగలకపోతే కొంచెం తమలపాకు రసాన్ని తీసుకుంటే కంఠం పెగులుతుంది. తమలపాకు తరచుగా తింటే నోటి దుర్వాసన పోతుంది.

చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఉపశమనం పొందాలంటే తమలపాకు రసంలో కస్తూరి ని కలిపి పేస్టులా చేసుకుని తేనెతో వారికి ఇస్తే జ్వరం తగ్గిపోతుంది. tamalapaku కాస్త వేడి చేసి దానిలోని ఐదు తులసి ఆకులు వేసి నులిమి రసాన్ని పిల్లలకి పది చుక్కలు రోజు ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.

tamalapaku లను రుబ్బుకొని కీళ్లవాతం, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు పూతల వేసుకుంటే ఉపశమనం త్వరగా ఉంటుంది. తమలపాకు రసాన్ని 15 మిల్లీలీటర్లు తీసుకొని వేడి నీటిలో కలుపుకొని తీసుకుంటే ఉబ్బసంతలనొప్పి, కడుపునొప్పి తగ్గుతాయి

శొంటి, మిరియాలును సమపాళ్లల్లో తీసుకొని తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే ఆస్తమా నయమవు తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు నయం చేసుకోవాలంటే తమలపాకు రసాన్ని, అల్లం రసాన్ని సమపాళ్లల్లో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

పిల్లల్లో అజీర్తికి చెక్కు పెట్టాలంటే తమలపాకు రసంలో మిరియాలు కలిపి కషాయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తమలపాకు ను రోజు నమిలితే మలబద్దకం, ఎసిడిటీ తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వేసకోశ సమస్యలు తగ్గుతాయి. తమలపాకును వేడిచేసి గాయాలపైన, వాపులుపైన పెడితే ఉపశమనం ఉంటుంది.


Post a Comment

0 Comments